మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రజాశక్తి- చౌడేపల్లె: ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కషిచేస్తుందని రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక భూగర్భ గనులశాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా చౌడేపల్లి మండలంలో విస్తతంగా పర్యటన చేసి పలు ప్రారంభోత్సవాలు చేశారు. శనివారం మంత్రి పర్యటనలో భాగంగా చౌడేపల్లి మండల పరిపాలన సచివాలయ సమావేశపు మందిరంలో ఈ మండల పరిధిలోని షికారిపాలెంనకు చెందిన 57మందికి అనుభవ ధవపత్రాలను, చౌడేపల్లి పంచాయతీ పరిధిలో దేవస్థానం భూములలో ఇండ్లు నిర్మించుకున్న 35మందికి పొజిషన్ సర్టిఫికెట్లను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులదేశించి మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి సంక్షేమ అభివద్ధి పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని పథకాలను పూర్తి పారదర్శకతతో అర్హులందరికీ చేరవేసేందుకు కషిచేస్తున్నామని తెలిపారు. షికారుపాలెంనకు సంబంధించి దాదాపు 100ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని, ఇంకా 150ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని తహశీల్దార్‌ను మంత్రి ఆదేశించారు. షికారులు వారికి మంజూరు చేసిన భూముల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఆ భూములను అభివద్ధి చేసుకునేందుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. చౌడేపల్లి పంచాయతీ పరిధిలో దేవస్థానం భూముల్లో ఇండ్ల నిర్మించుకొని ఉన్నవారికి పోజిషన్ సర్టిఫికెట్లు కూడా అందివ్వడం జరుగుతుందన్నారు. అనంతరం గడ్డంవారిపల్లెలో రూ.8.50లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్ అంగన్వాడీ భవనం, రూ.40లక్షలతో నిర్మించిన గ్రామసచివాలయాన్ని, రూ.21.8లక్షలతో నిర్మించిన రైతుభరోసా కేంద్రం పరికిదొన, చిన్నకంపల్లిలో రూ.8.50లక్షలతో నిర్మించిన వైఎస్‌ఆర్ అంగన్వాడీ భవనాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. మంత్రి పర్యటనలో టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర పాలఏకిర కార్పొరేషన్ చైర్మన్ మురళీధర్, బోయకొండ గంగమ్మ పాలకమండలి ఛైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, చౌడేపల్లి తహశీల్దారు మాధవరాజు, ఎంపీపీ రామ్మూర్తి, జడ్పిటిసి దామోదర్‌రాజు పాల్గొన్నారు.










