ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్ రాయదుర్గం మండల ఉపాధ్యక్షుని ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల అధికారి రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మండల ఉపాధ్యక్షుని ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మధ్యాహ్నం 12:30 దాకా వేచి చూసినప్పటికీ సభ్యులు ఎవరూ రాకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మండల ఉపాధ్యక్షుడు, కెంచానపల్లి ఎంపిటిసి కావలి సత్యనారాయణ గతేడాది నవంబర్ 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఉపాధ్యక్షుని పదవికి నలుగురు సభ్యులు పోటీ పడుతున్నారుర. ఈనేపథ్యంలో విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపిపి విద్యావతి సోదరుడు బోర్వెల్ నాగిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సభ్యులు ఏకాభిప్రాయానికి రానట్టు తెలుస్తోంది. దీంతోనే సభ్యులు ఎవరూ రాన్నుట్టు తెలుస్తోంది.
సభ్యుల కోసం ఎదురుచూస్తున్న అధికారులు










