Dec 01,2022 22:29

మల్బరీ సాగుపై సిరికల్చర్‌ అధికారులతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్‌

మల్బరీ దిగుబడి పెంచేలా శిక్షణ ఇవ్వండి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

జిల్లాలో మల్బరీ సాగు చేసే రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా అవసర మైన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ పట్టు పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని కలెక్టర్‌ ఛాంబర్‌ నందు కలెక్టర్‌ పట్టు పరిశ్రమ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, జిల్లాలో మల్బరీ సాగు తదితర అంశాలపై జిల్లా పట్టు పరిశ్రమ అధికారి శోభారాణి, సహాయ సంచాలకులు హనుమంత్‌ నాయక్‌, కిషోర్‌ నాయక్‌, సీత, మోహన్‌ బాబు లతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 21,600మంది రైతులు 37,631 ఎకరాలలో మల్బరీ సాగు చేస్తున్నారని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు రైతు లకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సచివాలయాలలోని సిరి కల్చర్‌ అసిస్టెంట్లు, అధికారులు కషి చేయాలన్నారు. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రాష్ట్రీయ కషి విజ్ఞాన యోజన పథకంలో భాగంగా అవగాహన కల్పించాలన్నారు. న్యూ ప్లాంటేషన్‌, షెడ్స్‌ నిర్మాణం, పరి కరాల కొనుగోలుకు ప్రభుత్వం అందిస్తు న్న ప్రోత్సాహకాలను రైతులు సద్విని యోగం చేసుకొనేలా చూడాలన్నారు. జిల్లాలో మల్బరీ సాగు కుప్పం, పలమనేరు డివిజన్‌లలోని మండలాలలో ఎక్కువగా ఉందని, 2022- 23 సంవత్సరానికి 3వేల ఎకరాలలో కొత్తగా మల్బరీ సాగులోకి తీసుకొని వచ్చేందుకు ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఇందులో భాగంగా నవంబర్‌ 22 వరకు 1723 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చామని పట్టు పరిశ్రమ శాఖ అధి కారి కలెక్టర్‌కు వివరించారు.
ఫిబ్రవరికల్లా మరో రెండువేల గ్రామాల్లో రీ సర్వే
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రెండువేల గ్రామాలకు సంబంధించి రీ సర్వే ప్రక్రియ ముగిసిందని, మరో రెండు వేల గ్రామాలలో ఫిబ్రవరి చివరి నాటికి నిర్వహించాల్సి ఉందని, నూతనంగా నియమించిన డిప్యూటీ తహశీల్దార్‌లకు శిక్షణ ఎంతైనా అవసరమని సిసిఎల్‌ఎ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అన్నారు. గురువారం మధ్యాహ్నం సిసిఎల్‌ఎ కార్యదర్శులు సిద్దార్థజైన్‌, ఇంతియాజ్‌లతో కలిసి కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో రెండువేల గ్రామాలకు సంబంధించి మొదటి దశలో రీసర్వే ముగిసిందని, ఇందుకు సంబంధించి రెండు లక్షల మందికి సంబంధించి పట్టాదారు హక్కులను కల్పించాల్సి ఉందన్నారు. వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, డిఆర్‌ఒ ఎన్‌.రాజశేఖర్‌, ఎన్‌డిసి పర్వీన్‌, డిటి శివకుమార్‌ పాల్గొన్నారు.