Mar 27,2022 23:38

మిరప సాగు

వాణిజ్య పంటల్లో రైతుకు ప్రధాన పంట
డిమాండ్‌ ఉండడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి
కోత సమయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచి రాబడి
ప్రజాశక్తి- వెదురుకుప్పం

వాణిజ్య పంటల్లో రాష్ట్రం కాకుండా, దేశంలోని రైతులకు మంచి ఆదాయం ఇచ్ఛే పంట. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో అధికంగా ఈ పంట పండిస్తారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయం మారుతున్న అంతర్జాతీయ ప్రమాణాలలో వాణిజ్య అవకాశాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ఇచ్చే పంట మిరప సాగు. దిగుమతులు ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది మార్కెట్లో అమ్ముడు పోయేది. ఆంధ్ర మిర్చి ( మిరప ) కి మంచి గిరాకి, డిమాండ్‌ ఉంది. మార్కెట్‌ లో ఆంధ్రా మిర్చి హాట్‌ కేక్‌ లాగా అమ్ముడు పోతుందని వ్యాపారస్తులు మాట. మండలంలో సుమారుగా 1100 ఎకరాల్లో మిరప పంట సాగు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు రికార్డుల్లో ఉంది. పంట కోత సమయం మార్చి నుంచి ఏప్రిల్‌ చివరి వారం వరకు కోత దశ అధికంగా ఉంటుందని చెప్పారు. సలహాలు సచనలు పాటించడం వలన అధిక దిగుబడి పొంది మంచి పంట రైతుకు చేతికందుతుంది. తద్వారా మార్కెట్‌లో ఆశించిన ధర పలుకుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
మిరప పంటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
మిరపకాయల కోతలకు కనీసం15-20 రోజుల ముందు నుంచి ఎటువంటి క్రిమిసంహారక మందులు పిచికారి చేయరాదు. కోతకు ముందు పంటకు నీరు ఇవ్యరాదు. కాయలు పండ్లు పక్వానికి వచ్చిన తరువాత జాగ్రత్తగా కోసుకుంటూ, కింద పడకుండా బుట్టలో వేసుకోవాలి. కింద పడితే ముడతలు పడతాయి. సూర్యకాంతి అధికంగా ఉన్న సమయంలో కోయరాదు. అందువల్ల రంగు మారిపోతుంది. పంట మీద పక్వానికి వచ్చే బాగా ఎర్రగా మారిన పండ్లు కోసుకోవాలి. మిరప పంటను దఫాలుగా కోసుకొని కుప్పగా పోసి ఒక రోజు అంతా కప్పి పెట్టాలి. అప్పుడే అన్ని కాయలు పక్వానికి వస్తాయి. కోత కోసిన మిరప పండ్లను నేలపైన ఆరబెట్టరాదు, పట్టపై ఆరబెట్టాలి. నేలపై పోస్తే పంట బూజు పట్టి తెలుపురంగు కాయలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల మార్కెట్లో ధర ఉండదు. మిరప పంటను రాత్రి సమయంలో మంచులో పెట్టరాదు. కుప్పగా పోసి కప్పాలి. అప్పుడే రంగు మారకుండా పంట నాణ్యతగా ఉంటుంది. పంటను ఎక్కువ భాగం ఎండలో ఎండబెట్టడం కూడదు. దీనివల్ల పక్వానికి వచ్చిన మిరప పండ్ల దెబ్బ తింటాయి. ఈ పద్ధతులు పాటిస్తూ మండలంలోని రైతులు పంటను నూర్పిడి చేసుకోవాలి.
కోతసమయంలో జాగ్రత్తలు పాటిస్తే అధిక ఆదాయం
మిరప పంటకు మంచి గిరాకి, డిమాండ్‌ ఉండడంతో కోత సమయంలో జాగ్రత్తలు పాటిస్తే మిర్చి రైతులకు అధిక ఆదాయం ఉంటుంది. రైతులు వ్యవసా యాధికారుల వద్ద సలహాలు, సూచనల మేరకు పంట సాగుచేస్తే మంచి రాబడి ఉంటుంది.
- వ్యవసాయ అధికారి విజయ భాస్కర్‌