'ఇంటింటికి సిపిఎం'లో నేతలు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
' మీ సమస్యలు తెలుసుకోడానికి మీ ఇంటి వద్దకే వచ్చాం.. చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకుంటాం.. అర్జీలను మీ సమక్షంలోనే అధికారులకు ఇస్తాం.. 'ఇంటింటికి సిపిఎం'ను జయప్రదం చేయండి' అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు ఇల్లిల్లు తిరిగారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని వైఎసఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాల భారాలను వివరిస్తూ ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేశారు. సోమవారం చిత్తూరు నగరంలోని కట్టెలదొడ్డి కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కాలనీలో నిరుపేద ఎస్సీలు ఉచిత కరెంట్ ఇవ్వలేదని వాపోయారు. అలాగే కలుషితమైన మంచినీటిని కార్పొరేషన్ వారు ఇస్తున్నారని సిపిఎం నేతల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ బిల్లులు పెరిగాయన్నారు. సమస్యల పరిష్కారానికి 20న సచివాలయాల వద్ద నిరసన చేపడతామని గంగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.సురేంద్రన్, చల్లా వెంకటయ్య, పి.చైతన్య పాల్గొన్నారు.
పలమనేరులో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి ఈశ్వరయ్య అధ్యక్షత వహించారు. గిరిధర్‌గుప్తా, ఓబుల్‌రాజు, సుబ్రమణ్యం, జయంతి, లక్ష్మయ్య, అంజి పాల్గొన్నారు.










