May 02,2023 21:54

మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

        ప్రజాశక్తి-అనంతపురం   గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సిఎం జగన్‌కు మీ దీవెనలు అందించాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోరారు. మంగళవారం అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి కాలనీ సచివాలయం-3 పరిధిలో 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సిఎం జగన్‌ మన రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఏవైనా పథకాలు అమలు కావాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసుకోవాలన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్నామన్నారు. అందరి మేలు కోరుతున్న సిఎం జగన్‌ను మరోమారు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపిపిలు, జడ్పీటీసీలు, వైస్‌ఎంపిపిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఛైర్మన్లు, డైరెక్టర్లు, స్టోర్‌ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.