May 19,2023 23:03

ప్రజాశక్తి - వీరవాసరం
            సుందరయ్య వంటి మహనీయులు దేశం కోసం చట్టసభల్లో లేవనెత్తిన అంశాలు నేటికీ చర్చనీయాంశమేనని ఎంపిపి వీరవల్లి దుర్గాభవాని అన్నారు. జుత్తిగ మారియ్య వర్థంతిని కొణితివాడలో ఆయన స్మారక స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్‌ పోతుల మృత్యంజయ అధ్యక్షతన నిర్వహించిన సభలో జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ సుందరయ్య వారసులుగా తమకు ఊపిరి ఉన్నంతవరకు ఆయన ఆశయ సాధనకు పాటు పడతామన్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు అందించారు. తొలుత సిపిఎం సీనియర్‌ నాయకులు కడలి వీరన్నశెట్టి జెండా అవిష్కరించారు. కేతా జ్యోతిబసు, అయినంపూడి బాబురావు సుందరయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్‌, బాలం విజయకుమార్‌, బొల్లెంపల్లి ప్రసాద్‌, చైతన్యప్రసాద్‌ పాల్గొన్నారు.