అనంతపురం : క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా అధ్యక్షుడు, స్పిరిట్ స్పోర్ట్స్ ఇండియా అవార్డు, దివ్యజ్ఞాన ఎంపవర్మెంట్ అవార్డు గ్రహీత, సమర్ధనం సంస్థ వ్యవస్థాపకుడు మహంతేష్.జికెకు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను రాష్ట్ర గవర్నర్ అందజేశారు. ఈ సందర్భంగా మహంతేష్ సేవలను గవర్నర్ కొనియాడారు.
మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది : మహంతేష్
ఎస్‌కెయు ఇచ్చిన డాక్టరేట్ తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అయ్యిందని డాక్టరేట్ స్వీకరించిన డాక్టర్ మహంతేష్ తెలిపారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం హర్షనీయమన్నారు. దివ్యాంగుల క్రికెట్ అభివృద్ధి తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. విద్య అన్నది వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా ఇతరులను అభివృద్ధి పథంలో నడిపించే సాధనమని చెప్పారు. తన అభివృద్ధి, తోడ్పాటులో అనేక మంది సహకారం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.










