Mar 28,2022 23:06

దిశ వాహనాలను ప్రారంభింస్తున్న డిఎస్పీ



మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌:

సోమవారం డీఎస్పీ కార్యాలయం వద్ద దిశ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, యువతులు కళాశాల, పాఠశాలల విద్యార్థినీల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చిందని, అందులో దిశ యాప్‌ ను రూపొందించిందన్నారు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ కలిగిన యువతులు, మహిళలు దిశ యాపును అప్లోడ్‌ చేసుకోవాలన్నారు. వారు ఆపదలో ఉన్న సమయాల్లో మొబైల్‌ ను అటు,ఇటు కదిలించినా,దిశా కాల్‌ సెంటరుకు మెసేజ్‌, కాల్‌ చేసిన కేవలం పది నిమిషాల్లోనే వారు ఉన్న ప్రదేశాలకు పోలీసులు చేరుకొని రక్షించడం జరుగుతుందన్నారు.గతంలో రక్షక్‌ వాహనాల స్థానంలో దిశా వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.మదనపల్లె పట్టణానికి రెండు వాహనాలు మంజూరయ్యాయని, పట్టణంలో ఎక్కడైనా ఆకతాయిల అల్లర్లు చేస్తున్నా,బాలికల కళాశాలలు,ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాల్లో సంచరిస్తుంటాయన్నారు.దిశ చట్టం వచ్చిన తర్వాత మహిళలు, యువతులపై అఘాయిత్యాలు చాలావరకు తగ్గుముఖం పట్టాయన్నారు.మహిళల సంరక్షణే పోలీసుల విధి అని పేర్కొన్నారు. ఇందుకోసం గ్రామ,వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులు నియమించడం జరిగిందన్నారు.వారు దిశ చట్టం,మహిళా చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.మహిళలు యువతులు ఆపదలో ఉన్నప్పుడు మనోధైర్యంతో తమను తాము రక్షించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో టూ టౌన్‌ సిఐ మురళి కష్ణ, ఎస్‌.ఐ.చంద్రమోహన్‌ , సోమశేఖర్‌, హరిహర ప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది, వార్డు మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.