Sep 20,2023 22:54

మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
గ్రామీణాభివద్ధి పీడీ తులసి
ప్రజాశక్తి- చిత్తూరు: ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ తీసుకున్న ప్రతిమహిళ వ్యాపారవేత్తలుగా ఎదగాలని డిఆర్డిఏ పథక సంచాలకులు డిఎంజె తులసి కోరారు. బుధవారం చిత్తూరు ఎస్‌ఎల్‌ఐసి కార్యాలయంలో అక్షరాస్యతపై సుమారు 35 మందికి శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి తులసి ఐఎన్‌డిఎస్‌ ఈటిఐ ఇండిసెంట్‌ డైరెక్టర్‌ ప్రేమసాగర్‌ పాల్గొన్నారు. పిడి తులసి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై ఇచ్చిన శిక్షణను మహిళలు గ్రామస్థాయిలో ఉన్నటువంటి మహిళ సభ్యులకు క్షుణ్ణంగా తెలియజేయాలని కోరారుజ అదేవిధంగా సంఘాలకు ఉపయోగపడే ఆర్థిక ప్రణాళిక సంఘం పంచ సూత్రాలు పాటించడం, నగదు రహిత లావాదేవీలు జరపడం, లోన్‌ యాప్‌ల ద్వారా మోసపోకుండా ఉండడం జీవనోపాధి కావలసిన రుణాలు పొంది గ్రామీణ స్థాయిలో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో డిపిఎపి నాగేశ్వరరావు, సీనియర్‌ ఫ్యాకల్టీ అనిల్‌ కుమార్‌, ఇండిసం డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.