Mar 29,2022 21:26

మహిలళకు అవగాహన కల్పిస్తున్న ప్రొఫెసర్‌ డాక్టర్‌ రజని

ప్రజాశక్తి - క్యాంపస్‌:
మహిళలు వ్యాపార అవకా శాలను అందిపుచ్చుకోవాలని హోంసైన్సు ఆచార్యులు రజని పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం 3,7,11 యూనిట్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేకసేవా శిబిరంలో భాగంగా మంగళవారం నాగూర్‌ కాలనీలో పొదుపు సంఘాల మహిళలకు వ్యాపారంలో మెళకువలు గురించి అవగాహనా కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో హోంసైన్సు విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రజని ముఖ్యఅతిóథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్స హించడం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. కుటుంబ స్థితిగతులను మార్చడంలో మహిళా వ్యాపారవేత్తలదే ప్రధానపాత్ర అని చెప్పారు. అనేక రకాల బిజినెస్‌ ఐడియాలను వారికి వివరించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ప్రోగ్రాం ఆఫీసర్‌ కె.స్వాతి ఆధ్వర్యంలో పాతశానంబట్ల గ్రామంలో ప్రత్యేక శిబిరంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరికీ ఆరోగ్య నిర్వహణపై చక్కని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ అధికారిణులు డాక్టర్‌ నీరజ, డా.మాధవి, డా.పద్మావతి, సర్పంచ్‌ శ్రీమతి శుభ, మహిళాపోలిస్‌ సునీత, పొదుపు సంఘాల మహిళలు, ఫార్మసీ, ఎంసిఏ విద్యార్థినులు, గ్రామ అధికారులు పాల్గొన్నారు.