ప్రజాశక్తి- కలకడ : మండల కేంద్రమైన కలకడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎస్‌ఐ రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాల్మీకిపురం సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, రాణించాలని తన ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలో ఉన్న వద్ధులు జబ్బులతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మల్లికార్జున, ఎంపిహెచ్ ఈరోజు కలకడ ఓ వెంకటేశు, హెల్త్ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, వైద్య సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.










