Mar 07,2022 21:02

డిఆర్‌డిఏ పీడి తులసి


ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
'మహిళా దినోత్సవం' పురస్కరించుకుని ఆమె 'ప్రజాశక్తి'తో మాట్లాడారు. ఇందులో తమ శాఖ ద్వారా మహిళలకు ఎలా ఆర్థిక తోడ్పాటు నిస్తున్నామో వివరించారు. ఆమె మాటల్లోనే
నేడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందు ఉంటున్నారు. వారికి కాస్త తోర్పాటునిస్తే మరింతగా బలోపేతం అవుతారు. పాఠశాల నుంచి పార్లమెంటు వరకు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. పేద, మధ్య తరగత మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక పథకాలు మా శాఖ ద్వారా అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎవరూ బాధ పడకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారికి తోర్పాటునిస్తోంది. ఆర్‌డిఐ పథకం ద్వారా మహిళలకు రూ.20 లక్షలను ఆయా గ్రూపుల ద్వారా అందిస్తున్నాం. తద్వారా వారిని సూక్ష్మ పెట్టుబడి దారులుగా తీర్చి దిద్దేందుకు అవకాశం లభిస్తోంది.
అలాగే పేద మహిళలలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పలు రకాల పింఛను పథకాలు అమలు చేస్తున్నాం. ఇందులో అభయహస్తం 16,743, వితంతు 8408, వృద్ధాప్య 2,99,603, ఒంటరి మహిళలు 12994 మందికి పింఛన్లు అందిస్తున్నాం. అలాగే వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ మహిళలకు సంవత్సరానికి ఒక్కొక్కరికీ రూ.18,750ి పంపిణీచేస్తున్నాం. వీటిని 1035 గ్రామ సచివాలయాల పరిధిలో 2021లో 1,73,475 మందికి రూ.325.27 కోట్లు పంపిణీ చేశాం. 2022లో 1,86,116 మంది లబ్దిదారులకు రూ.348.77 కోట్లు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేశాం. అలాగే వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 2019 ఏప్రిల్‌ నుంచి బ్యాంకుల్లో స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు 60,388 సంఘాలకు రూ.2319.49 కోట్లు జమ చేశాం.
సంపూర్ణ గృహకల్ప కింద రూ.10వేల చొప్పున 19762 మంది నుంచి రూ.19.76 కోట్లు మంజూరు చేశారు. తద్వారా వారికి ఇంటిమీద సొంత హక్కు కల్పించేందుకు అవకాశం కల్పించాం. అలాగే శ్రీనిధి పథకం కింద 78616 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.295.08 కోట్లు రుణ సౌకర్యం కల్పించాం. శ్రీనిధి ద్వారా 4973 కిరాణా షాపులు ఏర్పాటు చేయించాం. వాటికి హెచ్‌యుఎల్‌, ఐటిసి, పిఅండ్‌జి, రిలయన్స్‌ వంటి కంపెల ద్వారా వ్యాపారాన్ని అనుంధానం చేశాం. తక్కువ ధరలకు అమ్మకాలు జరిపేలా రూ.2.19 కోట్ల వ్యాపారాలు నిర్వహించేలా చేయూతనిచ్చాం. బ్యాంకు లింకేజీ పథకం ద్వారా 37,702 స్వయం సహాయక సంఘాలకు 1919.16 కోట్లు రుణ సౌకర్యం కల్పించాం. ఇలా పలు రకాలుగా మహిళలకు డిఆర్‌డిఎ అండగా ఉంటుంది.