సన్మానం చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-తిరుపతి సిటి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి తిరుపతి మున్సిపల్ పార్క్‌లో జరిగిన సత్కార సభకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిష్టర్ మమత, విశ్రాంత ఆర్డీవో సరస్వతమ్మ, ఎస్సై సుమతి, ఎంఈఓ లలితకుమారి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకురాలు నిర్మల, డా కల్పన, బిడిఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టరు ధనశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాల్లో జీవకోన జీవన్ జ్యోతి స్కూల్ పిల్లల ప్రదర్శించిన నృత్యం అందర్ని అలరించింది. ఈ కార్యక్రమంలో నేమిలేటి కిట్టన్న, అవల ప్రసాదరావు, ఎన్‌ఎస్‌ఎఫ్ నగేష్, వే ఫౌండేషన్ అంకయ్య, వనజాక్షి, చంద్రకళ, లక్ష్మి, చెన్నమ్మ,, గుంటూరురెడ్డి, రమణమ్మ, తదితరులు పాల్గన్నారు.










