ప్రజాశక్తి - మొగల్తూరు
మహిళలు హక్కుల సాధనకు ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ అన్నారు. మొగల్తూరులోని శ్రీవాసవీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మేడిద స్వర్ణలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళల హక్కుల కోసం ప్రభుత్వం మహిళా దినోత్సవం జరపాలన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, స్కీం వర్కర్లు కనీస వేతనాలకు కూడా నోచుకోకుండా వారితో వేటి చాకిరీ చేయిస్తున్నారన్నారు. శ్రామిక మహిళా నాయకురాలు ఎ.అజరు కుమారి మాట్లాడుతూ అందాల పోటీల పేరుతో ఆడవాళ్లను తక్కువ చేసి చూస్తున్నారని హక్కుల కోసం మనమందరం పోరాటం చేయాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం పోరాటం చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
పాలకొల్లు : పట్టణంలోని జివిఎస్‌విఆర్‌ఎం మున్సిపల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం హెచ్‌ఎం రాయపూడి భవాని ప్రసాద్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి నిట్టల శైలజ మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అనంతరం మహిళా ఉపాధ్యాయిలను, సచివాలయ సిబ్బందిని సత్కరించారు. లయన్స్ రూరల్ ప్రెసిడెంట్ గూడూరి హనుమంతరావు, మహిళా ఉపాధ్యాయులు బొక్క భవాని దుర్గ, చంద్రకళ, అడ్మిన్ రాజేశ్వరి, కొత్తల వెంకట కుమారి పాల్గొన్నారు.
మహిళలు స్వతంత్రంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ అసిస్టెంట్ కార్యదర్శి గోటేటి లక్ష్మి అలివేలు కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక డిఎన్‌ఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థిగా, ప్రస్తుతం ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లభ్యమయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళలు ఆర్థికంగా, వైజ్ఞానికంగా, శాస్త్ర, సాంకేతికంగా, రాజకీయంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు కలిగాయని వాటిని వినియోగించుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కోరారు. అనంతరం కళాశాల అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. అలివేలు దంపతులను కళాశాల సిబ్బంది ఘనంగా సత్కరించారు. సభకు ప్రిన్సిపల్ శోభారాణి అధ్యక్షత వహించారు.కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీఖాకొల్లు మైథిలి, పోలిశెట్టి లత, అడబాల వాణిశ్రీ, కె.రాజా శ్యామల, కొమ్ముల శ్రీలక్ష్మి, కెవైఎన్.వర్మ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
తాడేపల్లిగూడెం:మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భావితరాలకు మన సంస్కృతీ, సంప్రదాయాలను అందించే బాధ్యతలు మహిళల దేనని ఎఎంసి ఛైర్మన్ గుండుబాగుల వెంకటరమణ అన్నారు. మంగళవారం స్థానిక గర్ల్స్ హైస్కూల్లో డైమండ్స్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్ కోనా కళ్యాణి, డివైఇఒ రవీంద్ర భారతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. క్లబ్ అడ్మిన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోనా హనుమాన్, లయన్స్ క్లబ్ జిల్లా ఉపగవర్నర్ గట్టిం మాణిక్యాలరావు, లయన్ దుగ్గిరాల రమాకుమారి మాట్లాడారు. అనంతరం డివైఇఒ భారతి, ఎఎంసి ఛైర్మన్ గుండుబోగుల వెంకటరమణ, అంజనా దేవి.సునీత.పి.సాయిలక్ష్మి, రత్నకుమారిని క్లబ్ తరుపున సత్కరించారు.
పాలకొల్లు రూరల్ : లయన్స్ ఫెమినా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ కళాశాలలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వసంత లక్ష్మి మాట్లాడారు. ఆడపిల్లల జీవితంలో అత్యంత ప్రభావితం అయ్యే వయస్సు కాలేజీ రోజులని, 18 నుంచి 20 వరకూ శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండి జీవితంలో లక్ష్యసాధనం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ వసంత లక్ష్మి, సెక్రటరీ మీనా మణి దీప్తి, మౌని, యామిని పాల్గొన్నారు.
పెనుమంట్ర : మార్టేరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి దూలం కిషోర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అసిస్టెంట్ ఎం.కాజాబాబు, పిడికె.శ్రీనివాసరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.
మహిళలు ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు కుటుంబాన్ని నడిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇన్‌ఛార్జి ఎడిఆర్ టి.శ్రీనివాస్ అన్నారు. సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని పోటీ పరీక్షల్లో ఎక్కువగా మహిళలే ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. మహిళా శాస్త్రవేత్త డాక్టర్ వై.సునీత మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించుకుని తమను తాము రక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ కెఎం.దక్షిణామూర్తి, డాక్టర్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆకివీడు : ఆడపిల్ల పుట్టినరోజు సంతోషపడిన నాడే మహిళా దినోత్సవానికి నిజమైన సార్ధకత అని ప్రముఖ డాక్టర్ కనుమూరి మాధవి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దుంపగడప వివి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ కె.సుజాత అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కనుమూరు మాధవి, ఇంజినీరింగ్ అధికారి రమణమ్మ హాజరై మాట్లాడారు. అనంతరం వారు ఇరువురిని కళాశాల సిబ్బంది సత్కరించారు.










