ప్రజాశక్తి - ఆచంట
మహిళల ఆర్థిక సాధికారతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం వల్లూరు, భీమలాపురం, అయోధ్యలంక, కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులకు ఆచంట రామేశ్వరస్వామి సత్రంలో, ఆచంట వేమవరం, పెనుమంచిలి గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపు మహిళలకు ఆచంట వేమవరం జెడ్‌పి హైస్కూల్లో వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో 1252 గ్రూపులకు గాను రూ.12,18,85,990 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ చిల్లే లావణ్య, సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, బోడపాటి బుల్లయ్య, జక్కంశెట్టి చంటి పాల్గొన్నారు.
మొగల్తూరు: పేరుపాలెం సెంటర్లో బుధవారం నిర్వహించనున్న వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమంలో చీఫ్‌విప్ ముదునూరి ప్రసాద్‌రాజు పాల్గోనున్నారని ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. పేరుపాలెం, కెపి.పాలెం రెవెన్యూ గ్రామాలకు చెందిన స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేయనున్నారు.
పాలకోడేరు : మహిళల అభివృద్ధే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పాలకోడేరులో మండల పరిషత్ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు ఉండి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి నరసింహరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 1292 సంఘాలకు చెందిన 12 వేల మందికి లబ్ధి చేకూర్చిన రూ.14 కోట్ల మాన్యువల్ చెక్కును ప్రభుత్వ చీఫ్‌విప్ ప్రసాదరాజు, జెడ్‌పి ఛైర్మన్, నూతన ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్ మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు వైఎస్‌ఆర్ ఆసరా పండుగ జరుగుతుందని చెప్పారు. కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు 45 నెలల్లో అమలు చేసినట్లు తెలిపారు. డిసిసిబి ఛైర్మన్ పివిఎల్ నరసింహరాజు మాట్లాడుతూ టిడిపి మహిళలను అన్ని విధాలా మోసం చేసిందన్నారు. ఎంపిపి చంటిరాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహిళలు ప్రభుత్వానికి అండగా నిలబడి నరసింహరాజు గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఇంజేటి మరియమ్మ, ఎంపిటిసిలు నాగలక్ష్మి, స్వాతి, సర్పంచుల ఛాంబర్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతి రాజు వంశీకృష్ణంరాజు, బొల్లా శ్రీనివాస్, ఉప ఎంపిపిలు లక్ష్మీతులసి, నరేష్, నాయకులు దెందుకూరి వెంకటరాజు, చేకూరి నరేంద్రరాజు, శ్రీదేవి, దుండి అశోక్‌బాబు పాల్గొన్నారు.
పెనుమంట్ర: మహిళా సాధికారతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం మాముడూరు, సోమరాజు ఇల్లింద్రపర్రు గ్రామాల్లో ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసురెడ్డి) అధ్యక్షతన మహిళలకు ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరడం జరుగుతుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గూడూరు దేవేంద్రుడు, వనుం సూర్యనారాయణ, ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), వైస్ ఎంపిపి వాసంశెట్టి కిరణ్‌కుమార్, నేతలు పాల్గొన్నారు.










