Aug 15,2023 23:02

మహిళా సంఘాలకు మెగా చెక్కు అందజేత
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: డిఆర్‌డిఏ, మెప్మా మహిళా సంఘాలకు చిత్తూరు జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి, రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల, వయోవద్ధుల సంక్షేమశాఖ మంత్రి కెవి.ఉషశ్రీ చరణ్‌ మెగా చెక్కును అందజేశారు. అజాదికా అమత మహోత్సవంలో భాగంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మం గళవారం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో డిఆర్డిఏ, మెప్మా, విభిన్న ప్రతిభావంతులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ ద్వారా 47, 109 మంది లబ్ధిదారులకు రూ.54937. 92 లక్షల బ్యాంక్‌ లింకేజీ, శ్రీనిధి, సంబంధించి మెగా చెక్కును జడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌, జేసి పి.శ్రీనివాసులు, ఎస్పీ రిశాంత్‌రెడ్డితో కలసి లబ్ధిదారులకు పంపిణీని చేశారు. డిఆర్‌డిఏ ద్వారా బ్యాంకు లింకేజీ, శ్రీనిధి 37,846 మంది లబ్ధిదారులకు రూ.40626.68లక్షలు మెగా చెక్కును లబ్ధిదారులకు పంపి ణీ చేశారు. మెప్మా ద్వారా బ్యాంకు లింకేజ్‌ 9240మంది లబ్ధిదారులకు రూ.143 10.00 లక్షలు మెగా చెక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవద్ధుల సంక్షేమశాఖ ద్వారా 23 మంది లబ్ధిదారులకు రూ.1.24 లక్షలు విలువ చేసే వివిధ పరికరాలను పంపిణీ చేశారు. నలుగురికి ట్రై సైకిల్స్‌ను, ఇద్దరికి వీల్‌ చైర్స్‌ ను, ఇద్దరికి సీర్ట్చేస్‌ను, ఒక్కరికి సిపి చైర్‌ను, ఇద్దరికి ఎల్బో సీర్ట్చేస్‌ను, ఇద్దరికి ఆడిజిస్టబెల్ల్‌ వాకింగ్‌ స్టిక్స్‌ను, 10 మందికి వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. డిఆర్డీఏ, మెప్మా పిడీలు తులసి, రాధమ్మ, నగర పాలక సంస్థ కమీషనర్‌ డాక్టర్‌ జె.అరుణ, అడిషనల్‌ ఎస్పీలు సుధాకర్‌, శ్రీలక్ష్మి, జడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ పాల్గొన్నారు.