Mar 07,2022 18:21

ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : నగరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్.కె.రోజా పిలుపు మేరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మార్చి8వ తేది జరుగనున్న మహిళా దినోత్సవ సంబరాలో పాల్గొనడానికి, నగరి నియోజకవర్గం నుంచి బయలుదేరిన మహిళా ప్రజాప్రతినిధులతో కూడిన బస్సులను జెండా ఊపి సోమవారం ప్రయాణాన్ని నగరి ఎమ్మెల్యే శ్రీమతి R.K. రోజా సోదరుడు కుమార్ స్వామి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ విజయవాడ వెళ్లే మహిళలకు మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తిరిగి మీ యొక్క గృహాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను తెలిపారు. ఈ కార్యక్రమంలో... మండల అధ్యక్షురాలు ముని వేలమ్మ.. మహిళలు మరియు మున్సిపల్ చైర్మన్ ఏ హరి.. వైస్ చైర్మన్ లు డి శంకర్, డి జయప్రకాష్, వైసీపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.