Jul 02,2022 22:47

మహిళా అభ్యున్నతి ప్రభుత్వ ధ్యేయం : డిప్యూటీ సిఎం నారాయణస్వామి
ప్రజాశక్తి- ఎస్‌ఆర్‌ పురం

మహిళా అభ్యున్నతి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం కళత్తూర్‌ నారాయణస్వామి అన్నారు. శనివారం మండలంలోని నెలవాయి పంచాయతీ మరియు క్షీరసముద్రం గ్రామపంచాయతీలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి , రాష్ట్ర ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ ఎంసి. విజయానందరెడ్డి, చిత్తూరు డిసిసిబి డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ ప్రజాసమస్యలను గుర్తించి వాటి సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఓఎస్‌హెచ్‌ఆర్‌ తాగునీటి ట్యాంకు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ 126 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే నందవరం నుంచి నెలవాయి గ్రామానికి రెండు లక్షల రూపాయలతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. జగనన్న ప్రభుత్వం పేదవారి ప్రభుత్వమని, నాడు- నేడు పథకం కింద పాఠశాలలు, వైద్యశాలలను, అభివద్ధి పరుస్తున్నామని, 50 పడకుల ఆసుపత్రి నియోజకవర్గానికి రెండు మంజూరు అయ్యాయని ఉన్నాయని అన్నారు. కార్యక్రమానికి జడ్పిటిసి రమణ ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పిటిసి గురువారెడ్డి, సర్పంచ్‌ అధ్యక్షుడు దిలీప్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్లు ఐశ్వర్య, జయలక్ష్మి, కాపు సంఘ అధ్యక్షుడు విజయబాబు, జనార్ధన్‌, తహశీల్దార్‌ సబీర్బాషా, ఎంపీడీఓ పార్వతమ్మ, హౌసింగ్‌ డీఈ వెంకటేశ్వర్లు, విద్యుత్‌ శాఖ ఏడి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.