May 21,2022 14:56

ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మహానాడు విజయవంతం చేయాలని  శనివారం మండల కేంద్రమైన ఎస్ఆర్ పురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు
మహానాడు ప్రణాళిక చర్చ సన్నాహక సమావేశం  నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త భీమినేని చిట్టి బాబు నాయుడు అన్నారు.  ఎస్ ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం టిడిపి నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ ... ఎస్ఆర్ పురం , గంగాధర నెల్లూరు పాలసముద్రం పెనుమూరు కార్వేటినగరం వెదురుకుప్పం ఆరు మండలాల్లో ఉన్న టిడిపి నాయకులు వారి వారి పంచాయతీలో మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరికీ అన్ని రకాల ఏర్పాట్లు మీరు దగ్గరుండి చూసుకోవాలని నాయకులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాము చిత్తూరు పార్లమెంట్ కార్యదర్శి తలారి రెడ్డప్ప రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి బాలాజీ నాయుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు గుండయ్య రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధికార ప్రతినిధి నేత ఈశ్వర్ మండల అధ్యక్షులు రాజేంద్ర సామి దాసు చంగల్రాయల్ యాదవ్ లోకనాథ్ రెడ్డి  రుద్రయ్య నాయుడు మాజీ అధ్యక్షులు దేవ సుందరం మోహన్ మురళి యువత ప్రధాన కార్యదర్శి బాబు మైనారిటీ నాయకుడు మబూ బాషా తిరుమల నాథ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు