అనంతపురం కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మహిళాభివద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు సమయం కేటాయించాలన్నారు. అందరికీ పోషకాహారం అందేలా చూడాలని, ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన ఆంధ్రప్రదేశ్, భారతదేశం కోసం ముందుకు నడవాలన్నారు. జిల్లాలో చిరుధాన్యాల సాగుకు నేల అనువుగా ఉందన్నారు. ఈ భూమిలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయన్నారు. రైతులు చిరుధాన్యాలు సాగు చేసేలా చైతన్యవంతం చేయాలన్నారు. పోషకాహారం, దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలన్నారు. పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అంగన్వాడీ స్థాయిలో గర్భిణులు, బాలింతలకు, మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు అరకట్టేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. కషి విజ్ఞాన కేంద్రం నుంచి తీసుకొచ్చిన వివిధ పోషకాహారం న్యూట్రిషన్ ప్లాంట్స్‌ను పంపిణీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చిరుధాన్యాల వంటలతో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, సోషల్ వెల్ఫేర్ జెడి మధుసూదన్ రావు, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బు కొఠారి, డిటిడబ్ల్యూఒ అన్నాదొర, మెప్మా పీడీ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ ఏడిఏ శైలజ, కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి, సాయి ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి విజయ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.










