Oct 05,2023 19:34

రక్తదానం చేస్తున్న దృశ్యం


రక్తదానం చేస్తున్న దృశ్యం
మెగా రక్తదాన శిబిరం
ప్రజాశక్తి-కావలి:తమకు మంచి జీవితాన్ని, సంస్కారాన్ని అందించిన తల్లిదండ్రుల స్మారకంగా పలు సేవాకార్యక్రమాలునిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం నాయకులు డాక్టర్‌ యేగూరు చంద్రశేఖర్‌ తెలిపారు. వారి తల్లి యేగూరు రమణమ్మ 10వ వర్ధంతి సందర్బంగా గురువారం రెడ్‌ క్రాస్‌ రక్తకేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా యేగూరు సోదరులు చంద్రశేఖర్‌, జగన్‌ లు మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు యేగూరు చిన మాలకొండయ్య, రమణమ్మ ల మరణానంతరం వారి నేత్రాలను దానం చేశామన్నారు.కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు డి రవిప్రకాష్‌, గంధం ప్రసన్నాంజనేయులు, దామిశెట్టి సుధీర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.