Jul 16,2023 22:39

ప్రజాశక్తి - పాలకొల్లు
            పాలకొల్లు ఛాంబర్స్‌ కళాశాల, ఇంపాక్ట్‌ హెచ్‌ఆర్‌ సౌజన్యంతో కాలేజీలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌ మేళాలో ఎంఎల్‌సి కవురు శ్రీని వాస్‌, ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇసి మెంబర్‌ డాక్టర్‌ బి.జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కళాశాల ఛైర్మన్‌ కెవిఆర్‌.నరసింహరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. జాబ్‌మేళాకు పెద్దఎత్తున స్పందన రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. మొత్తం 18 కంపెనీల నుంచి విచ్చేసిన హెచ్‌ఆర్‌లు అభ్యర్థులను రాత పరీక్షలు, టెక్నికల్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 632 అభ్యర్థులను ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఒక సెమీ అర్బన్‌ ప్రాంతమైన పాలకొల్లుకు తీసుకొచ్చి జిల్లా వాసులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ఛాంబర్స్‌ కళాశాల ముందు వరుసలో ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నేడు నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలో మెగా జాబ్‌ మేళా నిర్వహించడం ఛాంబర్స్‌ కళాశాల మిగతా కళాశాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. విద్యతోపాటు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించేందుకు ప్రతి కళాశాల కృషి చేయా లని, విద్యార్థులకు టెక్నికల్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ఎంపికైన 632 అభ్యర్థుల్లో 147 మంది అభ్యర్థులు ఛాంబర్స్‌ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఉన్నారని కళాశాల ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ కె.లక్ష్మణరావు తెలిపారు.