Mar 11,2022 21:48

శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం



చిత్తూరు అర్బన్‌ : మేయర్‌ పుట్టినరోజును నగరపాలక సంస్థలో ఘనంగా నిర్వహించారు. మేయర్‌ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో నగర కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ మేయర్‌ కు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ శ్రీలక్ష్మి, ఎంఈ ధనలక్ష్మి, ఆర్వో గోపాలకష్ణ వర్మ, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉదయం డిప్యూటీ మేయర్‌ రాజేష్‌ కుమార్‌ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు మేయర్‌ కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ సానిటరీ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మధ్యాహ్నం మేయర్‌ నగరంలోని అనాధ ఆశ్రయంలోని వద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వారి సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు.