ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
సిఐటియు ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక చుక్కా అప్పల స్వామి భవనంలోని అపరాల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సమావేశం నిర్ణయాలను పత్రికలకు విడుదల చేశారు. మేడే రోజున ఉదయం కార్మికుల పని ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఎగుర వేసి, అనంతరం టుటౌన్‌లోని ఎన్‌కె గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలిపారు. ఈ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఉద్యోగ కార్మిక సంఘాలు నాయకులు ప్రసంగిస్తారని వివరించారు. సభ అనంతరం పట్టణంలో కార్మిక, ఉద్యోగులతో భారీ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కరెడ్ల రామకృష్ణ, జవ్వాది శ్రీనివాసు పాల్గొన్నారు.
గణపవరం : మే 1న గణపవరంలో జరిగే ప్రదర్శన బహిరంగ సభల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి పి.గోవిందు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేడే రోజు ఉదయం ఎనిమిది గంటలకు సిఐటియు కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రదర్సనలో కార్మికులు, అంగన్వాడీలు, డ్వాక్రా యానిమేటర్లు, పంచాయతీ కార్మికులు పాల్గొనాలని కోరారు.










