అనంతపురం కలెక్టరేట్ : మే రెండవ వారంలో జిల్లా వ్యాప్తంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి మెగా గహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఎమ్.గౌతమి అధికారులకు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో హౌసింగ్ అంశంపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యం మేరకు మెగా గహ ప్రవేశ కార్యక్రమానికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో పలు కారణాల వల్ల గహప్రవేశ కార్యక్రమం వాయిదా పడిందన్నారు. ఈసారి ఆ అవకాశం లేకుండా పనులు వేగవంతం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ కేశవ నాయుడు, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ భాగ్యరాజ్, సీపీవో ప్రేమ్‌చంద్ పాల్గొన్నారు.










