
పొన్నాడ సాగర్
ప్రజాశక్తి - ఆమదాలవలస: ఆలిండియా మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షలో మండలంలోని గట్టుముడిపేటకు చెందిన పొన్నాడ సాగర్ 200 ర్యాంకు సాధించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పట్టణంలోని టింపని హైస్కూల్‌లో విద్యనసభ్యసించిన సాగర్, ఇంటర్మీడియట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చదివారు. ఎంబిబిఎస్ విజయనగరం మహారాజా కాలేజ్‌లో, పిజి జనరల్ మెడిసిన్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. ఆయన తండ్రి కీ.శే పొన్నాడ రాజేష్ పట్టణంలో ఆర్‌ఎంపిగా, ప్రజా వైద్యునిగా సేవలందించారు. తల్లి ఉమాదేవి గృహిణి. సాగర్ ర్యాంకు సాధించడంపై కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.