Nov 04,2023 19:36

మాట్లాడుతున్న వైద్యులు

ప్రజాశక్తి-నెల్లూరు : నగరంలోని మెడికవర్‌ వైద్యశాల కేన్సర్‌ ఇన్సిస్టిట్యూట్‌ విభాగంలో ప్రప్రథమంగా నిర్వహించిన బోన్‌మారో ట్రాన్స్‌ ప్లాంట్‌ చికిత్స విజయవంతంగా చేసినట్లు మెడికవర్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ బింధు భార్గవి రెడ్డి, హాస్పిటల్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ మహేశ్వర రెడ్డి, మెడికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ రంగరామన్‌ పేర్కొన్నారు. శనివారం మెడికవర్‌ వైద్యశాల సమావేశ మందిరంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలానికి చెందిన నెల్లూరు తిరుపాలు అనే వ్యక్తి గత 5 ఏళ్లుగా లింఫోమా బ్లడ్‌ క్యాన్సర్‌ తో బాధపడుతు పలు వైద్యశాలల్లో చికిత్సలు తీసుకున్నాప్పటికీ ఫలితం లేదన్నారు. తమ ఇన్సిస్టిట్యూట్‌ను సంప్రదించారన్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన మెడికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ రంగరామన్‌ కేన్సర్‌ రోగుల్లో 10 శాతం మందికి చికిత్స తీసుకున్నప్పటికీ లాభం ఉండదన్నారు. అటువంటి కేన్సర్లకు హైడోస్‌ కీమోథెరపీ నిర్వహించి బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంట్‌ చికిత్స నిర్వహించి రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దవచ్చుని కుటుం బసభ్యులకు తెలిపామన్నారు. వాస్తవానికి ఈ చికిత్సకు 20 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుందని, రోగి ఆర్థిక పరిస్ధితిని గుర్తించిన వైద్యులు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందజేస్తామనిచెప్పడంతో వారు అంగీకరించారన్నారు. దీంతో ఎంతో క్లిష్టమైన బోన్‌ మారో ట్రాన్స్‌ ప్లాంట్‌ చికిత్స ను రోగికి విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. మెడికవర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ ధీరజ్‌ రెడ్డి, క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అంకాలజీ వైద్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.