Mar 03,2022 20:26

మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సాధన సమితి నాయకులు.




కలెక్టర్‌కు 'సాధన సమితి' వినతి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పిటిఎం శివప్రసాద్‌, కో కన్వీనర్లు దివాకర్‌, శివలు మాట్లాడుతూ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ప్రజల ఆకాంక్షల మేరకు సుదీర్ఘపోరాటం చేస్తున్నామని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన జనగనమన జాతీయ గీతం పుట్టుక, స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మదనపల్లి దేశంలోనే అత్యంత పెద్ద రెవిన్యూ కేంద్రంగా ఉన్న విషయాన్ని గుర్తించుకొని మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ప్రజల నుండీ సేకరించిన 800లకు పైగా అర్జీలను జిల్లా కలెక్టర్‌కు అందించారు. ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించేంతవరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి చేశారు.