అనంతపురం : మదనపల్లి రూరల్ మండలం అబ్బగొంది అడవిలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదురిపికొండ గ్రామానికి చెందిన బోయ రమణ కుమార్తె వినీషా (18), అదే గ్రామానికి చెందిన ధనంజయ కుమారుడు ముత్తులూరు వెంకటనాయుడు (28) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి ఈనెల 9న రాత్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. ఈనేపథ్యంలో ఈనెల 14న మదనపల్లి అబ్బగొంది అడవిలో చున్నీతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టగా మృతులు అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదురిపికొండకు చెందిన వారిగా తెలిసిందన్నారు.
మృతిచెందిన వెంకటనాయుడు, వినీష (పాతచిత్రాలు)










