మదనపల్లె జిల్లా కోసం ధర్మాగ్రహ దీక్ష
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
బుధవారం స్థానిక బీటీ కళాశాల ఎదుట ధర్మాగ్రహ దీక్ష పేరుతో జిల్లా సాధన సమితి కన్వీనర్ పిటిఎం శివప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా సాధన సమితి ప్రతినిధులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా శివప్రసాద్, కోకన్వీనర్లు బి.శ్రీచందు, కోనేటి దివాకర్, ముత్తరాశి హరికష్ణ, జనసేన నాయకుడు జంగాల శివరాం, సిపిఎం నాయకులు శ్రీనివాసులు, సీపీఐ నాయకుడు కష్ణప్ప, మైనార్టీ రైట్స్‌ఫోరం నాయకులు సలాం, కురుబసంఘం నాయకుడు జీవి శివకుమార్ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు, మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయడానికి అన్నివిధాలా అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ధర్మబద్దంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్లైతే రాష్ట్రంలోనే తొలి ప్రాధాన్యత మదనపల్లె జిల్లాకే ఇవ్వాల్సి ఉందని తెలిపారు. కార్యక్రమంలో బాస్ రాష్ట్ర గిరిజన సమాఖ్య, వాల్మీకి మహాసేన, మైనార్టీ రైట్స్‌ఫోరం, అల్లూరి సీతారామరాజు ఆటో యూనియన్, వీసీకే, సిపిఎం, సీపీఐ నాయకులు ముత్యాలమోహన్, కొండుపల్లి ఆనంద్, రవిశంకర్, రాజేష్, శ్రీరాములు, మనోహర్‌రెడ్డి, బడికాయలపల్లి నరసింహులు, బండకోట రవి, జనార్థన్, రెడ్డిప్రసాద్, లక్ష్మీనారాయణ, హరీష్, శశి, మహేంద్ర, నితిన్ పాల్గొన్నారు.










