ప్రజాశక్తి - భీమవరం రూరల్
మండలంలోని వెంప గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వెంప గ్రామంలో గత టిడిపి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కాలనీలో రోడ్లు, డ్రెయినేజీలు, వీధిలైట్లు, పైపు కనెక్షన్లు లేక అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గురువారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. కొద్దిపాటి వర్షానికి రోడ్లు మునిగిపోయి నీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి సంధి అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాలనీలో కూడా మౌలిక వసతులు, రోడ్లు, డ్రెయినేజీలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు.










