Oct 24,2023 19:01

నిర్వాసితులతో మాట్లాడుతున్న సిఐటియు కార్యదర్శి నరసింగరావు

ప్రజాశక్తి -గుడ్లూరు :పోర్టు నిర్వాసిత గ్రామాలైన ఆవుల వారి పాలెం, మొండి వారి పాలెం, క ర్ల పాలెం గ్రామాల్లో మంగళవారం సిఐటియు ప్రతినిధి బందం పర్యటించింది. ఈ బృందంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్‌. నరసింగరావు, జిల్లా నాయకులు జి.వెంకటేశ్వర్లు, పి. పెంచలయ్య, జి. వి. బి. కుమార్‌, హైకోర్టు అడ్వకేట్‌ యన్‌. కష్ణ మూర్తి, స్థానిక నాయకులు యన్‌.వెంకటేశ్వర్లు , యి. బ్రహ్మయ్య ఉన్నారు. పోర్టు వస్తె ఇంటికొక ఉద్యోగం, 3 ఏళ్లపాటు నెలకు బస్తా బియ్యం, రోజుకు మహిళలకు 350నగదు, మగ వారికి రూ. 450 ప్రత్యేక ప్యాకేజీ వంటి మాటలు నమ్మి భూములు వదులు కొన్నామని, ఇళ్లు ఖాళీ చేవామని, కానీ తమకు ఒరిగిందేమీ లేదని పోర్టు నిర్వాస గ్రామలోల్లోని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీ అన్నారని.. బస్తా బియ్యం ఇచ్చి దుమ్ము దులుపుకున్నారన్నారు. ఉద్యోగం ఊసేలేదని, సముద్ర తీరంలో హాయిగా ఉండే వాళ్లం.. అడవుల్లోకి వచ్చి అనారోగ్య పాలైనామని భాదను వ్యక్తం చేశారు. సంవత్సరం రోజుల నుంచి వేటలేదు.. పనులు లేవు.. వాళ్లు ఇచ్చిన డబ్బుతో, మరి కొంత అప్పు చేసి ఇల్లు కట్టుకున్నామని, తాము ఎలా బతకాలని వాపోయారు.
2013 'అర్‌ అండ్‌అర్‌' ప్యాకేజీ అమలు చేయాలి
ఈ సందర్భంగా నరసింగరావు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ ఆవుల వారిపాలెం, మొండివారి పాలెం, కర్లపాలెం గ్రామస్తులు పోర్టు కోసం ఎంతో త్యాగం చేశారని కొనియాడారు. అంత త్యాగం చేసిన వారికీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని విమర్శించారు. ఇది న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులు పెట్టి వారికి రావాల్సిన పరిహారం చెల్లించకుండా ప్రభుత్వానికి డబ్బు మిగలించి ఎవరిని ఉద్ధరించడానికి అని ప్రశ్నించారు. పోర్టు నిర్వాసితుల కోసమా? లేక అదానీ కోసమా? చెప్పాలని మండి పడ్డారు. ప్రభుత్వం వారికి ఇస్తామన్న ప్యాకేజీ, నెలకు రూ 15, 000 మూడేళ్లపాటు ఇవ్వాలని, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ సాధన కోసం మూడు గ్రామాల వారు ఏకమై పోరాడాలని, నిర్వాసితులకు సిఐటియు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన వారు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్యాకేజీ రాలేదని, వెంటనే వారికి కూడా ప్యాకేజీ అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పి. పెంచలయ్య, జి విబి కుమార్‌.ఎన్‌ .వెంకటేశ్వర్లు ఇ బ్రహ్మయ్య, ఉపేంద్ర హైకోర్టు అడ్వకేట్‌ ఎన్‌ కష్ణ మూర్తి పాల్గొన్నారు.