Aug 16,2023 21:34

మాతాశిశు మరణాలు తగ్గించాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ప్రభావతి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ.ప్రభావతి దేవి, స్పెషల్‌ కమిషనర్‌ వైద్యఆరోగ్యశాఖ విజయవాడ వారి జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రోగ్రాం అధికారులకు 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్‌ ద్వారా విపులంగా అవగాహన తీసుకురావాలని, అన్ని డివిజన్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. దీని ద్వారా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మాత శిశు మరణాలను తగ్గించాలని కోరారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్‌ ద్వారా హైరిస్‌ ప్రెగెంట్‌ ఉమెన్‌, గర్భిణీలు ఎవరైతే సివియర్‌ అనిమిక్‌ ప్రెగెంట్‌ ఉమెన్‌ ఉన్నారో వారిని ఇంటి వద్ద నుండి ఆసుపత్రికి తీసుకువచ్చి, రక్తమార్పిడి అయిన తర్వాత ఇంటికి చేర్చడం జరుగుతుందని తెలిపారు. సురక్షితమైన ఆరోగ్యవంతమైన ప్రసవం జరగడానికి ఇంటి వద్ద నుండి ఆసుపత్రికి కూడా ఉచితంగా తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సౌకర్యం అందించడం జరుగుతుంది. ఈ రవాణా సౌకర్యానికి గర్భిణులు అందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకట ప్రసాద్‌, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ సుదర్శన్‌, డాక్టర్‌ సందీప్‌ డాక్టర్‌ శిరీష, శ్రీనివాసులు, జార్జ్‌, రేణుక ప్రభ, శ్రీవాణి, రామ్మోహన్‌, జయరాముడు తదితరులు పాల్గొన్నారు.