Mar 17,2023 22:50

రోడ్లు శుభ్రం చేస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటరీలు

ప్రజాశక్తి-అనంతపురం      అనంతపురం ఎస్‌ఎస్‌బిఎన్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1 ఆధ్వర్యంలో శుక్రవారం మాసివ్‌ క్లీనింగ్‌ ప్రోగ్రాం నిర్వహించారు. 2022-2023 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అఫైర్స్‌, స్పోర్ట్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం చేపట్టారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ నగరూరు రసూల్‌ ఆధ్వర్యంలో 80 మంది వాలంటరీలు రైల్వే స్టేషన్‌ ఆవరణ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. దీని ప్రధాన ఉద్దేశం శుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో ఎస్‌కె యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళీధర్‌ పాల్గొని రైల్వేస్టేషన్‌, బస్టాండ్లు, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ తదితర ప్రాంతాల్లో పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవను కొనియాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌, యూనిట్‌-1 విభాగాధిపతి నగరూరు రసూల్‌ మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రం చేసుకోవడం వల్ల అనేక రకాల జబ్బుల నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. మంచి ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కె యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ఆదినారాయణ రెడ్డి, వలి, డా, ఎన్‌.ఓబిరెడ్డి, వాలంటరీలు అబ్దుల్‌, బ్రహ్మ, వంశీ, సాంబ, అనిల్‌, జ్ఞానేష్‌, అశోక్‌, స్రవంతి, బాలు, యమున, రాకేష్‌, కిరణ్‌, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.