Mar 14,2023 18:47

ప్రజాశక్తి - పాలకొల్లు
ఏప్రిల్‌ తరువాత వచ్చే మామిడి పండ్లు మార్చి మొదట్లోనే మార్కెట్లోకి వచ్చాయి. మొగల్తూరుకు చెందిన మామిడి పండ్లను పాలకొల్లు - నరసాపురం రోడ్డులో కొందరు అమ్ముతున్నారు. అయితే కొన్ని మామిడి చెట్లు జన్యుపరంగా ముందుగా గాని, ఆలస్యంగా గాని కాపుకొస్తాయి. ఈ నేపథ్యంలో కొన్ని చెట్లు ముందుగా కాపు కాయడంతో వాటిని ముగ్గపెట్టి పాలకొల్లు మార్కెట్లో అమ్ముతున్నారు. పరక సైజు బట్టి రూ.250 నుంచి రూ.450 వరకూ అమ్ముతున్నారు. అయితే రుచిపరంగా తియ్యగా ఉన్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు.