ప్రజాశక్తి - ఉండి
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని కలిసిపూడి గ్రామస్తులు పలువురు ప్రశంసించారు. మండలంలోని కలిసిపూడి గ్రామంలో మానవత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని పలువురు ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ మండల అధ్యక్షులు, కలిసిపూడి ఎంపిటిసి సభ్యులు దంగేటి రామలింగేశ్వరరావు (కలిసిపూడి రాము) మాట్లాడుతూ వాహనదారులు, బాటసారులు, గ్రామస్తులు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి ఈ చలివేంద్రాలు ఎంతగానో తోడ్పాటునిస్తాయన్నారు. మానవత సంస్థ సేవలను మండలంలో విస్తృతం చేయడానికి మరింత కృషి చేస్తున్నట్లు దంగేటి రామలిం గేశ్వరరావు తెలిపారు. తనకు సహకారం అందిస్తున్న కలిసిపూడి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.










