Mar 31,2022 22:46

మాట్లాడుతున్న ఎంపిడిఓ వెంకటనారాయణ




ప్రజాశక్తి - క్యాంపస్‌
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో తిరుపతి రూరల్‌ మండలం లోని కుంట్ర పాకం, ఎగువచేనేత పల్లి, నాగూర్‌ కాలనీలలో వారం రోజులుగా జరుగుతున్న ప్రత్యేక సేవా శిబిరం గురువారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి మండల అభివద్ధి అధికారి డాక్టర్‌ వెంకటనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా శిబిరాలు వాలంటీర్లకు సామాజిక అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, సంకల్పం మంచిదైతే, అవి ఖచ్చితంగా సాకారం అవుతాయని చెప్పారు. గ్రామంలోని పాఠశాలలకు జాతీయ నాయకుల చిత్రపటాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారిణులు డాక్టర్‌ పి నీరజ, డాక్టర్‌ మాధవి, డాక్టర్‌ పద్మావతి, మండల సెక్రటరీ మురళి, గ్రామ సర్పంచ్‌ శ్రీమతి శుభ, ఉపసర్పంచ్‌ మురళి, పద్మనాభరెడ్డి, వల్లీ, గ్రామ వాలంటీర్లు, ఎన్‌. ఎస్‌.ఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.