Apr 23,2023 22:13

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్‌
             ఉల్లంపర్రు మాంటిస్సోరి స్కూల్‌లో మెరిట్‌ స్కాలర్‌షిప్‌ వేడుకలను శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్‌సి కమిషన్‌ మెంబర్‌ చెల్లం ఆనందప్రకాష్‌, యడ్ల తాతాజీ, జెడ్‌పిటిసి సభ్యులు నడపన గోవిందరాజులునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్‌ అడ్మినిస్ట్రేటర్‌ మద్దాల వాసు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం రూ.పది లక్షల విలువైన మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను 250 మంది విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. దీంతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి మంచి చదువులు చదివి పైకి వస్తారని తెలిపారు. యడ్ల తాతాజీ మాట్లాడుతూ మాంటిస్సోరి స్కూల్‌లో చదువుకే కాకుండా క్రీడలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సైన్స్‌ ఫెయిర్‌లో లింకా బుక్‌ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నారంటే సామాన్య విషయం కాదని తెలిపారు. జెడ్‌పిటిసి సభ్యులు గోవిందరాజులునాయుడు మాట్లా డుతూ గత సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులకు రూ.పది వేల చొప్పున ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదని తెలిపారు. ఆనందప్రకాష్‌ మాట్లాడుతూ మంచి విలువలతో కూడిన విద్య అందించటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్‌, సెక్రటరీ మద్దాల రాంప్రసాద్‌, ప్రిన్సిపల్‌ ఎస్‌.వసంతలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.