Aug 19,2023 00:48

మాంగళ్య షాపింగ్‌మాల్‌ ప్రారంభం
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరంలో హైరోడ్డులో అత్యాధునిక భవనంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను ప్రముఖ సినీనటి కాజల్‌ అగర్వాల్‌, చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, ఎపిఎస్‌ ఆర్‌టిసి వైఎస్‌ ఛైర్మన్‌ ఎంసి విజయానందరెడ్డిలు శుక్రవారం ప్రారంభిం చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ మాంగళ్య చిత్తూరులో ప్రారంభించడం ఎంతో సంతో షంగా ఉందన్నారు. వరంగల్‌లో 2012లో ప్రారంభమైన మాంగళ్యా షాపింగ్‌ మాల్‌ అందచెలంచెలుగా ఎదిగి తమ 16వ మాల్‌ను చిత్తూరులో ప్రారంభించడం వల్ల ఈ ప్రాం త ప్రజలకు మహా నగరాల్లో మాత్రమే లభించే ఫ్యాషన్‌ వస్త్రాలు చిత్తూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన యాజమ్యాన్ని అభినందించారు. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన నగర మేయర్‌ మాట్లా డుతూ మహిళలు ఆదరించే కంచి, ధర్మవరం పట్టు, ఫ్యాష న్‌ వస్త్రాలు అన్ని మాంగళ్య షాపింగ్‌మాల్‌ చిత్తూరులోనే అందుబాటులో ఉండటం హర్షనీయమన్నారు. మాంగళ్య షాపింగ్‌ మాల్‌ కంప్లీట్‌ షాపింగ్‌ మాల్‌ అన్ని చిత్తూరులో 16వ బ్రాంచ్‌ ప్రాంరభించడం ఎంతో సంతోషంగా ఉం దని ప్రముఖ సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. తాను పదిసంవత్సరాలుగా మాంగళ్య షాపింగ్‌మాల్‌తో అనుబం ధం ఉందని వ్యక్తిగతంగా తనకు మాంగళ్య షాపింగ్‌ మాల్‌ వస్త్రలు ఎంతగానో నచ్చుతారు అన్నారు. వివాహా ఇతర శుభకార్యాలకు చెన్నై, బెంగుళూరు వంటి మహా నగరాలకు వెళ్ళకుండా చిత్తూరులోనే అందుబాటులో ఉంటాయన్నా రు. షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాంగ ళ్య షాపింగ్‌ మాల్‌ వ్యవస్థాపకులు పియన్‌ మూర్తి, ఛైర్మెన్‌ అండ్‌ డైరెకర్లు కాసం నమశ్వివాయ, కాసం మల్లిఖార్జున్‌, కాసం కేదారినాథ్‌, కాసం శివప్రసాద్‌, పుల్లూరు అరుణ్‌, పుల్లూరు వరుణ్‌, పుల్లూరు విశాల్‌, తోడుపునూరు కార్తిక్‌, తోడుపునూరు అరుణ్‌, కాసం ఫణిత్‌, కాసం సాయి కృష్ణ తో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు.