మామిడి పరిశ్రమలకు చేయూత
ఆహార సంబంధిత పరిశ్రమలను మరిన్ని నెలకొల్పాలి : మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్రంలో అనేక పరిశ్రమలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కషి చేస్తుందని చిత్తూరు జిల్లాలో పలు రహదారులు విస్తరణ పనులు జరుగుతున్నందున మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ పర్యావరణ విద్యుత్, మైనింగ్‌శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అన్నారు. శనివారం పట్టణంలో మామిడిగుజ్జు పరిశ్రమల యజమానులకు, రైతులకు, ఇతర కొనుగోలుదారులకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ఆధునిక లాబరేటరీలను నేడు వారు ప్రారంభించారు. శనివారం ఉదయం కట్టమంచి బాలకష్ణరెడ్డి మామిడి భవనంను ప్రారంభించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, రాష్ట్ర అటవీపర్యావరణ, విద్యుత్, మైనింగ్‌శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అనంతరం లేబరేటరీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని పలు రహదారులు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నందున మరిన్ని వచ్చే అవకాశం ఉందని రైతులకు, పరిశ్రమలకు ఉపయోగపడేలా ఆధునిక లాబరేటరీ కార్యాలయాలను ఏర్పాటు చేసినందుకు జిల్లా మామిడి పల్ప్, పండ్ల పరిశ్రమ యజమానులను ఆయన అభినందించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులు విత్తనాలు కొనుగోలు నుంచి పండించిన పంటను అమ్ముకునేంతవరకు సహకరించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలలో అందుతున్న సేవలు గురించి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అధికారులు రావడమే కాక ఇతర దేశాలకు చెందిన పలువురు వచ్చి అధ్యయనం చేసి తమ దేశాలలో కూడా ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించడం జరుగుతుందని దీనిని బట్టి వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహకరిస్తుందో తెలుసుకోవాలని అన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మామిడి అభివద్ధికి కట్టమంచి బాలకష్ణారెడ్డి చేసిన సేవలు అభినందనీయమని జిల్లా వ్యాప్తంగా పలు పరిశ్రమలు ఏర్పాటుచేసి ఎగుమతులను చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఇటీవల ముఖ్యమంత్రి మరియు గవర్నర్ లు ఆయనకు వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకతి వైపరీత్యాల కోసం 3వేల కోట్ల నిధులను ఏర్పాటు చేసి పంటలు నష్టపోకుండా ఈక్రాప్ బుకింగ్, ఈకేవైసీలను పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పండ్ల పరిశ్రమ యజమానులకు కొనుగోలుదారులకు సంబంధించి ఒక కార్యాలయం మంచి వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈసందర్భంగా నంద్యాల పార్లమెంటు సభ్యులు అపెడ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఉద్యానవన పంటలలో మామిడి ముఖ్యమైనదని చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ అభివద్ధికి వాతావరణంతో పాటు శ్రమలు కేంద్రీకతకం కావడం ఆనందకరమని రానున్నకాలంలో మరిన్ని ప్రోత్సాహకాలు అందుకొని పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ఎగుమతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యాలయ భవన నిర్మాణానికి సహకరించిన పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, బ్రహ్మానందరెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిలకు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిలు రెడ్డప్ప, బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, జడ్పీచైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు ఎంఎస్ బాబు, రాష్ట్ర ఆర్‌టిసి వైస్‌చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, చిత్తూరు మేయర్ ఆముద, చూడ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి తదతరులు పాల్గొన్నారు.
నాడు- నేడులో జిల్లా ప్రధమస్థానం: మంత్రి పెద్దిరెడ్డి
నాడు- నేడు కార్యక్రమం అమలులో రాష్ట్రంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఇదేస్థాయిని కొనసాగించేలా జిల్లా యంత్రాంగం కషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్, భూగర్భ గనులు, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతికశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక జెడ్పి సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 5 సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజాసమస్యలను జిల్లాలోని ఎంపిపిలు, జెడ్పిటిసిలు, శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ సర్వసభ్య సమావేశం ద్వారా ప్రభుత్వం దష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈసమస్యలను వచ్చే సమావేశం లోపు పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా గడపగడపకు వైఎస్‌ఆర్ ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారని, ఈ కార్యక్రమం ద్వారా స్థానికంగా అవసరమైన మంచి నీరు సరఫరా, సిసి రోడ్డుల నిర్మాణం వంటి మౌళిక వసతులలో గల పలుసమస్యలకు పరిష్కారం లభిస్తున్నదని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అవసరమైన చోట్ల సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీటి వసతులు వంటి పలు మౌళిక వసతులను దాదాపుగా ఏర్పాటు చేసుకున్నామని, మిగిలిన వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సచివాలయానికి మంజూరు చేసిన రూ.20లక్షలలో పూర్తి చేసుకోవచ్చునని తెలిపారు.
కట్టమంచి బాలకృష్ణారెడ్డి భవన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి










