గౌతంరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు
మాజీమంత్రి గౌతంరెడ్డికి నివాళులు
ప్రజాశక్తి-మర్రిపాడు:కీర్తిశేషులు మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి 52వ జయంతి సందర్భంగా చిలకపాడు, మర్రిపాడు లో మండల జెసిఎస్ కన్వీనర్ సిద్ధం రెడ్డి మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు మంత్రి పాదయాత్ర ద్వారా ప్రజల తో మమేకమైవారి సమస్యలను తెలుసుకుని 2014 ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. 2019లో రెండవసారి శాసనసభ్యునిగా ఎన్నికై యువతకు నైపుణ్యా భివద్ధి సంస్థలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. కష్ణాపురంలో మాజీ సర్పంచ్ లక్ష్మి రెడ్డి, సిద్ధారెడ్డి రాంపల్లిలో వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమంలో వైసిపి నాయకులు కొండారెడ్డి, రవి అన్వర్ బాషా, కేపీ నరసింహులు పాల్గొన్నారు.










