May 19,2023 23:04

ప్రముఖుల సంతాపం
ప్రజాశక్తి - ఉండి

             మండలంలోని పాందువ్వ గ్రామానికి చెందిన మాజీ ఎంఎల్‌సి, టిడిపి సీనియర్‌ నాయకులు మంతెన వెంకట సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను) తండ్రి విశ్రాంత ఉపాధ్యాయులు మంతెన నారాయణరాజు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఎఐజి హాస్పిటల్‌లో చికిత్సపొందు తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతి చెందినట్లు మంతెన వెంకట సత్యనారాయణరాజు తెలిపారు. నారాయణ మృతదేహానికి ఉండి, పాలకొల్లు ఎంఎల్‌ఎలు మంతెన రామరాజు, నిమ్మల రామానాయుడు, మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌రావు, మాజీ జెడ్‌పి ఛైర్మన్‌ ముల్లపూడి బాపిరాజు, ఉంగుటూరు మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టిడిపి తాడేపల్లిగూడెం ఇన్‌ఛార్జి వలవల బాబ్జి, నెల్లూరు టిడిపి నాయకులు బీద రవిచంద్ర, కొత్తపల్లి నాగరాజు, ముదుండి సురేంద్రవర్మ నివాళులర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణరాజు ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని, అటువంటి వ్యక్తి మరణం మంతెన వెంకట సత్యనారాయణ రాజు కుటుంబానికి, గ్రామానికి తీరని లోటని అన్నారు.
నారాయణరాజు మృతి బాధాకరం
పాలకొల్లు :మాజీ ఎంఎల్‌సి పాందువ్వ శ్రీనివాస్‌ తండ్రి నారాయణరాజు మృతి ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా జిల్లా ప్రజలకు ఎంతో నిరాశ కలిగించిందని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు అన్నారు. నారాయణరాజు మృతదేహంపై పూలమాలలు ఉంచి ఎంఎల్‌ఎ నివాళులర్పించారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు.