Jul 27,2023 08:54

ప్రభాకర్‌చౌదరికి స్వాగతం పలుకుతున్న టిడిపి నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : లండన్‌ పర్యటన ముగించుకుని అనంతపురం చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుధవారం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి పుచ్చగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. పూల మాలలు, శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. లండన్‌లో వారం రోజుల పాటు తెలుగు సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని వచ్చిన సందర్భంగా టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. మరూర్‌ టోల్‌ ప్లాజా వద్ద తెలుగుయువత నాయకులు బంగినాగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వారుతో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద అభిమానుల తాకిడితో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సరిపూటి రమణ, మార్కెట్‌ మహేష్‌, గోపాల్‌గౌడ్‌, సుధాకర్‌యాదవ్‌, చంటి, కూచి హరి, బోయపాటి బాలప్ప, నాగరాజు, వన్నూర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.