Apr 08,2023 15:28
  • కార్యక్రమం చిత్తశుద్ధిగా గ్రామ వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి...

ప్రజాశక్తి-నార్పల : మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్ పై ఉందని ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన నార్పలలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం గురించి నార్పల నాలుగు సచివాలయాలలో స్థానిక వైసీపీ నాయకులతో కలిసి గ్రామ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం చేయించారు. అదేవిధంగా మండల పరిధిలోని గూగూడు బండ్లపల్లి పప్పూరు తదితర గ్రామ సచివాలయాల్లో కూడా గ్రామ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ వాలంటీర్లతో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన లబ్ధి గురించి ప్రతి గ్రామ వాలంటరీ చిత్తశుద్ధిగా ప్రజలకు వివరించి 2024లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పథకాన్ని మధ్యవర్తలు లేకుండా నేరుగా ప్రజలకే అందే విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు ముఖ్యమంత్రి చేసిన మంచిని ప్రతి గ్రామ వాలంటరీ విపులంగా గ్రామీణ ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వైసిపి సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి ఎం ఈ ఎం ఎస్ రాష్ట్ర డైరెక్టర్ మండల కన్వీనర్ నిట్టూరు రఘునాథరెడ్డి  జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ  రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్  హరిత రాజగోపాల్ మండల అధ్యక్షులు నాగేశ్వరావు సర్పంచ్ మనీలా సుప్రియరు ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు వైసిపి నాయకులు వేదాంత మోహన్ గ ప్రభుదాసు,  శివయ్య,  చికెన్ గోపాల్,  సదాశివ, గవ్వల ప్రవీణ్,  గ్రామ వాలంటీర్ లు, తదితరులు పాల్గొన్నారు..