Apr 08,2023 16:58

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలంలోని బైరెడ్డి పల్లి  లక్కనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న  గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాజం పేట పరిశీలకులు క్రిష్ణమూర్తి, మండల సచివాలయ కన్వీనర్ కార్తిక్ బైరెడ్డిపల్లి, సర్పంచ్ వెంకటేష్, లక్కనపల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి, వైస్ సర్పంచ్ తనయుడు రాజేంద్ర.ప్రభాకర్ రెడ్డి, గోవింద్ రెడ్డి,. బైరెడ్డిపల్లి మండలంలోని వైయస్సార్ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి బ్యానర్లు వేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాల గురించి కృష్ణమూర్తి క్షుణ్ణంగా గ్రామ గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు వివరిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల పరిధిలోని సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు