Oct 26,2022 12:40

ప్రజాశక్తి-బంగారుపాళ్యం : చిరుత దాడులో యువకునికి గాయాలైన సంఘటన మండలంలోని కాటప్పగారిపల్లి పంచాయతీ దిగువ ఎద్దుల వారి పల్లి వెంకటస్వామి మామిడి తోపులో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. గాయపడిన వ్యక్తిని ఇచ్చిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో నిద్రిస్తుండగా చిరుత దాడి చేసి గాయపరిచినట్టు ఉదయం గ్రామస్తులకు తెలపగా వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి అతనిని చికిత్స నిమిత్తం బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నందున చిత్తూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.