Jul 09,2023 22:38

లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం
ప్రజాశక్తి - ఉండి

           లయన్స్‌ క్లబ్‌ సేవలను మండలంలో విస్తృతం చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. ఆదివారం ఉండి రాజులపేటలోని లయన్స్‌ ఆడిటోరి యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రస్తుత అధ్యక్షులు గొట్టుముక్కల రాము అధ్యక్షతన నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం క్లబ్‌ నూతన అధ్యక్ష కార్యదర్శులు వేగేశ్న అనంతలక్ష్మి, కన్నెగంటి రూత్‌కళ మాట్లాడుతూ సేవల్లోనే సంతృప్తి ఉంటుందన్నారు. తమకు సామాజిక సేవ చేయడానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించిన ఉండి ఎఎంసి మాజీ ఛైర్మన్‌, లయన్‌ సాగిరాజు సాంబశివరాజు, కోశాధికారి సాగిరాజు సూర్యకుమారి దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే సమాజ సేవ చేయడానికి తమకు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు రూ.లక్షా 70 వేలు సహాయం అం దించడంతో ప్రతి పైసా స ద్వినియోగం చేసి లయన్స్‌ సేవలను విస్తృతం చేస్తా మని, ఉండి లయన్స్‌ క్లబ్‌ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌ ఈపూరి సత్యనారాయణ, మేకా శ్రీరామ సురేష్‌, జిల్లా వైస్‌ గవర్నర్‌ కాకరాల వేణుబాబు, రీజియన్‌ ఛైర్మన్‌ దాట్ల రామరాజు, జోనల్‌ ఛైర్మన్‌ కె.సత్యనారాయణమూర్తి, జోన్‌ ఛైర్మన్‌ రంగారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్‌ ద్వారంపూడి నారాయణరెడ్డి, ఉండి లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.