లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలి
జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ భక్తవత్సలరెడ్డి
ప్రజాశక్తి- సోమల:
సదుం మండలంలో లయన్స్ క్లబ్ సేవలు మరింతగా విస్తరించి అభివద్ధి చెందాలని జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ భక్తవత్సలరెడ్డి అన్నారు. శనివారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ఆవరణంలో సదుం మండల లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశం జరిగింది. సదుం లయన్స్ క్లబ్ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో అనేక సేవాకార్యక్రమాలు, పశు వైద్యశిబిరాలు, మొక్కలు నాటడం వద్ధులకు వికలాంగులకు పలు పరికరాలు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. మాజీ లయన్స్ సభ్యులు కూడా ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. అనంతరం పీలేరు, కలికిరి, వాయల్పాడు మండలాల్లోని పలు వద్ధాశ్రమాలకు బియ్యం బస్తాలను ఉచితంగా అందజేశారు. పలువురు సభ్యులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సహదేవయ్య, మాజీ అధ్యక్షులు రమణారెడ్డి పాల్గొన్నారు.










