Jul 09,2023 20:37

లయన్స్‌ క్లబ్‌ పామిడి అధ్యక్షురాలుగా డాక్టర్‌ ఎం.శాంతిప్రియను సన్మానిస్తున్న దృశ్యం

         గుత్తి : లయన్స్‌ క్లబ్‌ పామిడి అధ్యక్షురాలుగా డాక్టర్‌ ఎం.శాంతిప్రియ ఎన్నికయ్యారు. గుత్తి పట్టణంలో శాంతి ప్రియా ఆసుపత్రిని నిర్వహిస్తూ ఎన్నో సేవా, సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వాటిని గుర్తించిన లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు డాక్టర్‌ ఎం.శాంతి ప్రియా ను పామిడి లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకున్న ఆమెను సోమవారం శాంతి ప్రియ హాస్పిటల్‌ లో ఏపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం తాలూకా అదనపు కార్యదర్శి జెన్నే కుళ్లాయిబాబుతోపాటు పలువుర ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాంతి ప్రియ హాస్పిటల్‌ సిబ్బంది అశోక్‌, రవి, మైనుద్దీన్‌, మాధవి, మంజుల, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.